News November 19, 2024

కోవూరులో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుపై ఆలోచించండి: ఎమ్మెల్యే

image

కోవూరులో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయడానికి వీలుంటే పరిశీలించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ‘కోవూరు నియోజకవర్గంలో పాటూరు, గుమ్మలదిబ్బలో చేనేతలు ఎక్కువగా ఉన్నారు. వారికి చేయూతనిచ్చేలా ఒక టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు పరిశీలించండి. చేనేతలకు హెల్స్ ఇన్సూరెన్స్‌లు కూడా కల్పించాలి’ అని ఆమె కోరారు.

Similar News

News December 3, 2024

 పీఎస్ఎల్వీ సీ -59 రాకెట్ ప్రయోగానికి‌ కౌంట్ డౌన్

image

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట షార్ నుంచి ఈనెల 4వ తేదీన‌ పీఎస్ఎల్వీ‌ సీ – 59రాకెట్ ను ప్రయోగించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.38గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించనున్నట్లు శాస్రతవేత్తలు తెలియజేశారు. కౌంట్ డౌన్ కొనసాగిన తరువాత 4వ తేదీన‌ సాయంత్రం 4.08 గంటలకు ప్రయోగించనున్నారు. సోమవారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించారు. మొదటి ప్రయోగ వేదికలో అనుసంధాన పనులు జరుగుతున్నాయి‌.

News December 2, 2024

రేపు సూళ్లూరుపేటకు జిల్లా కలెక్టర్ రాక

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా,సూళ్లూరుపేటలో రేపు ఉదయం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన హాజరై ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News December 1, 2024

కొండాపురం: హత్య చేసిన నిందితుడు అరెస్ట్

image

కొండాపురం మండలం గానుగపెంటలో బంకా తిరుపాలు అనే మేకల కాపరిని హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ శ్రీధర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. గానుగపెంటలో బుధవారం బాంకా తిరుపాలు హత్యకు గురయ్యాడు. పశువులు కాస్తున్న మాల్యాద్రి(మల్లి) ఈ హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. తిరుపాలుకు చెందిన మేకలను అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని ఆశతోనే ఈ హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు.