News July 6, 2024
కోవూరు: గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం

కోవూరు: సాలుచింతల సమీపంలోని ముళ్లపొదల్లో వృద్ధురాలి మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. శనివారం ఉదయం పొదల వద్ద నుంచి దుర్వాసన వస్తుండడంతో అటుగా వెళ్లి స్థానిక యువకులు చూడగా మహిళ మృతదేహం కనిపించింది. మహిళ మృతిచెంది నాలుగు రోజులు అయ్యి ఉంటుందని, శరీరం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్లు తెలిపారు. నెల్లూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 26, 2026
నెల్లూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్‌తో ఒకరి మృతి?

నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం నాగులవరానికి చెందిన టీడీపీ నాయకుడు(47) చనిపోయారు. కావలిలో నివాసం ఉండే ఆయన వారం కిందట పొలం పనులకు వెళ్లినప్పుడు కాలికి ఏదో కుట్టినట్లు అనిపించింది. తర్వాత జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. ఎంతకి తగ్గకపోవడంతో చెన్నైకి తీసుకెళ్లారు. ఈనెల 24వ తేదీ చనిపోయారు. స్క్రబ్ టైఫస్‌తో మరణించినట్లు డాక్టర్లు రిపోర్టు ఇచ్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
News February 26, 2026
నెల్లూరు: మీ ఏరియాలో పాలు బాగుంటాయా?

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురు చనిపోయారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. పాల నాణ్యతను నిర్ధారించేందుకు మాజిక్ బాక్స్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అక్కడికక్కడే పాల కల్తీని గుర్తిస్తున్నారు. జిల్లాలో100 వరకు డెయిరీలు ఉండగా.. వీటిల్లో తనిఖీలు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర రావు Way2Newsకు వివరించారు. మీ దగ్గర పాలు బాగుంటాయా? లేదా?
News February 26, 2026
నెల్లూరు: కౌలు రైతులకు రిక్త హస్తం..!

2025-26 ఏడాదికి 38 వేల మందికి CCRC(పంట సాగుదారు హక్కు పత్రాలు) ఇవ్వాల్సి ఉండగా 22,600 మందికి మాత్రమే ఇచ్చారు. వీరికి ఇచ్చిన రుణాలపై లీడ్ బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులు వద్ద లెక్కలు లేవట. యజమానులు తమ భూములుపై ఇప్పటికే రుణాలు తీసుకోగా కౌలు కార్డుదారులకు రుణాలు అందడం లేదు. దీంతో బ్యాంకు రుణాలు అందక.. బయట అధిక వడ్డీల భారం మోయలేక కౌలు రైతులు డీలా పడుతున్నారు. రబీ స్టార్ట్ అయి 2 నెలలు అవుతోంది.


