News July 6, 2024
కోవూరు: గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం

కోవూరు: సాలుచింతల సమీపంలోని ముళ్లపొదల్లో వృద్ధురాలి మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. శనివారం ఉదయం పొదల వద్ద నుంచి దుర్వాసన వస్తుండడంతో అటుగా వెళ్లి స్థానిక యువకులు చూడగా మహిళ మృతదేహం కనిపించింది. మహిళ మృతిచెంది నాలుగు రోజులు అయ్యి ఉంటుందని, శరీరం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్లు తెలిపారు. నెల్లూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 15, 2025
చంద్రబాబు హామీలు పేపర్లకే పరిమితం: కాకాణి

చంద్రబాబు రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేస్తున్నాడని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేవలం జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు హామీలన్నీ పేపర్లకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు.
News February 15, 2025
ఉలవపాడు: BPCL రిఫైనరీని వ్యతిరేకిస్తూ సమావేశం

రామాయపట్నం పోర్ట్ ఆధారంగా 6 వేల ఎకరాలలో BPCL తలపెట్టిన రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుకు ఆదిలోనే గండం ఏర్పడింది. BPCL కోసం తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదని సముద్ర తీర గ్రామాలకు చెందిన మత్స్యకార రైతులు శుక్రవారం తేల్చి చెప్పారు. కరేడు పంచాయితీలోని అలగాయపాలెంలో రామాయపట్నం, చాకిచర్ల పట్టపుపాలెం తదితర గ్రామాల మత్స్యకారులు పెద్ద సంఖ్యలో సమావేశమై ప్రభుత్వం చేసే బలవంతపు భూసేకరణను ప్రతిఘటించాలని తీర్మానించారు
News February 15, 2025
నెల్లూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. ఉపాధ్యాయుడిపై కేసు

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకులైన ఉపాధ్యాయుడిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు ముందు టీచర్ హేళనగా మాట్లాడటంతో మనస్తాపం చెంది హాస్టల్ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేసి ఉపాధ్యాయుడు వీర రాఘవులుపై కేసు నమోదు చేశారు.