News August 28, 2024

కోవూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పి

image

SPS నెల్లూరు జిల్లాలోని సంతపేట, కోవూరు పోలీసు స్టేషన్ లను జిల్లా ఎస్.పి. జి.కృష్ణకాంత్ మంగళవారం సాయంత్రం సందర్శించారు. పోలీసు స్టేషన్ పరిసరాలను, పోలీసు స్టేషన్స్ మ్యాప్, చార్ట్ లను, స్టేషన్స్ పరిధిలో ఉన్న హైవే, నేర, శాంతి భద్రతల పరిస్థితులను పరిశీలించారు.
మహిళా సంబంధిత సమస్యలపై సత్వరమే స్పందించి, పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News December 7, 2025

నెల్లూరులో బస్సు డ్రైవర్‌పై కత్తితో దాడి

image

నెల్లూరులో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. బోసుబొమ్మ సెంటర్ వద్ద బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 7, 2025

నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనును సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు.

News December 7, 2025

సైదాపురం : వంతెనకు మరమ్మతులు చేయరూ?

image

సైదాపురం నుంచి గూడూరుకి వెళ్లే ప్రధాన రహదారిలో కైవల్య నదిపై వంతెన ఉంది. ఇది రాజంపేట నుంచి గూడూరుకి ప్రధాన రహదారి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.12 ఏళ్ల కిందట నిర్మించిన వంతెనపై గుంత ఏర్పడి కమ్మీలు బయటపడటంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.