News October 21, 2024

కోవూరు: రైలు ఢీకొని వృద్ధుడు మృతి

image

కోవూరు మండలం పడుగుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు సుమారు 70 సంవత్సరాల వయసు కలిగి, తెల్లని నిండు చేతుల చొక్కా, కాఫీ కలర్ చెక్స్ లుంగీ ధరించి ఉన్నాడు. చొక్కా కాలర్‌పై మ్యాక్స్ టైలర్స్ కోవూరు లేబుల్ ఉంది. మృతుడు ఎవరు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 3, 2024

అధికారుల తీరుపట్ల మంత్రి ఆనం అసహనం 

image

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్ల అధికారి వ్యవహరించిన తీరుపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ZP సమావేశంలో MPను సగౌరవంగా ఆహ్వానించకపోవడంతో అలిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం వేమిరెడ్డికి అందరి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి తెలిపారు. 

News November 3, 2024

బాలాయపల్లి: జయంపు గ్రామంలో ఉద్రిక్తత

image

బాలాయపల్లి మండలం, జయంపు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివారెడ్డి జనార్దన్ రెడ్డి ఇంటిపై అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారు. శివారెడ్డి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులను అమానుషంగా కొట్టి గాయపరిచారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 3, 2024

వాకాడు: తండ్రిని చంపిన తనయుడు అరెస్ట్

image

వాకాడు మండల పరిధిలోని శ్రీనివాసపురం గిరిజన కాలనీలో కొడుకు తండ్రిని కొట్టి చంపిన కేసులో నిందితుడు తుపాకుల రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. వాకాడు సీఐ హుస్సేన్ బాషా మాట్లాడుతూ.. తుపాకుల రమేశ్ మద్యానికి బానిసై తన కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో నిత్యం గొడవలు పడుతూ పలువురిని గాయపరచిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.