News January 26, 2025
కోవెలకుంట్లలో అమానవీయ ఘటన..కాలువలో శిశువు

కోవెలకుంట్ల పట్టణంలోని సంతపేటలో మురికి కాలువలో ఆడ శిశువును పడేసిన అమానవీయ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. కాలువలో శిశువు విషయాన్ని పోలీసులకు స్థానికులు తెలుపగా హెడ్PC కృష్ణ నాయక్ అక్కడికి చేరుకొని పసికందును ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విక్కీ ఫౌండేషన్ సభ్యులు అంత్యక్రియలు చేపట్టారు.
Similar News
News March 1, 2026
మార్చి 3న సింహాచలంలో దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3న సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తునట్టు ఈఓ వెంకట్రావు శనివారం తెలిపారు. గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు భక్తులకు మరుసటి రోజు అనుమతిస్తామన్నారు. దర్శనాలతో పాటు ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News March 1, 2026
పుష్పగిరి: ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరులు

వల్లూరు మండలం పుష్పగిరి సంతాన మల్లేశ్వర ఆలయం వద్ద ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరుని రూపాలు ఉండటం అత్యంత అరుదని చరిత్రకారుడు బి.రమేష్ తెలిపారు. అర్చకులు అఖిల్ స్వామి సమాచారంతో పరిశోధించిన ఆయన ఈ శిల్పం పశుత్వం నుంచి దైవత్వానికి మారడాన్ని సూచిస్తుందన్నారు. చారిత్రక దాడుల్లో నంది ముఖం ధ్వంసమైనా లింగధారినంది, అద్భుతమైన హారాలు, అర్ధ పద్మాసనంలో ఉన్న నందికేశ్వరుని శిల్పకళ విశేషంగా ఆకర్షిస్తుందన్నారు.
News March 1, 2026
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

బాపట్ల జిల్లాలో రబీ సీజన్‌కు మార్చి 21 వరకు 8,339 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పాక్స్‌లలో 1,573 ఎం.టన్నులు, రైతు సేవ కేంద్రాల్లో 714, డీసీఎంఎస్‌లో 214, ప్రైవేట్ రిటైల్ వద్ద 2,298, మార్క్‌ఫెడ్ గోదాముల్లో 3,208 ఎం.టన్నులు నిల్వ ఉన్నాయని చెప్పారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ.266.50 మాత్రమేనని, అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


