News November 30, 2024

కోవెలకుంట్లలో ఆర్టీసీ బస్సు కింద పడి మెకానిక్ దుర్మరణం

image

నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో శనివారం విషాదం ఘటన జరిగింది. ఆర్టీసీ అద్దె బస్సులో ప్రైవేట్ మెకానిక్ చిన్న వెంకట రమణారావు (గణపతి) రిపేరు పని చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ చూసుకోకుండా బస్సును ముందుకు కదిలించడంతో బస్సు చక్రాలు మెకానిక్ తలపై నుంచి వెళ్లాయి. రమణారావు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 21, 2025

రైతు సంక్షేమంపై దృష్టి సారించండి: కలెక్టర్

image

వ్యవసాయ సహాయక శాఖల పనితీరు, రైతులకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అగ్రికల్చర్ అల్లయిడ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ, పశుసంవర్ధక, పాల, మత్స్య, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతులకు సమయానికి విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

News October 21, 2025

పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులు చేయాలి: కలెక్టర్

image

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీఐఐసీ జడ్ఎంను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో ప్రాజెక్టులు, భూ సేకరణ అంశాలపై ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్షించారు. 3 కిలోమీటర్ల మేర భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News October 20, 2025

నేడు పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంగా ఇవాళ జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఈ వేదిక జరగాల్సి ఉంది. పండుగ కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో కార్యక్రమం నిలిపివేశామని ఎస్పీ పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీలు ఇవ్వడానికి వచ్చే ప్రజలు వ్యయప్రయాసలతో రావొద్దని విజ్ఞప్తి చేశారు.