News August 28, 2024
కోవెలకుంట్లలో బాలికపై అత్యాచారం?

నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితులపై కోవెలకుంట్ల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం నంద్యాల జీజీహెచ్‌కు తరలించినట్లు సమాచారం. రాష్ట్రంలో రోజురోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నా హోంమంత్రి పట్టించుకోవడం లేదంటూ వైసీపీ మండిపడింది.
Similar News
News February 12, 2026
అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 5వ తరగతి, 6వ నుంచి 10వ తరగతి మిగులు సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరం (ఆంగ్ల మాధ్యమం) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఎంఈ గీతా తెలిపారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. అభ్యర్థులు https://apbragcet.apcfss.in వెబ్‌సైట్‌లో ఈనెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 12, 2026
మహాశివరాత్రి వేళ.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదన్నారు. OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు.
News February 12, 2026
టీచర్ లేకుండా ఎలా పాసవ్వాలి.. విద్యార్థుల ఆవేదన

కోడుమూరు జడ్పీ బాలుర పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు కాళీ ఏర్పడింది. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో సైన్స్ టీచర్ లేకపోవడంతో ఏ విధంగా పరీక్షలకు సిద్ధం కావాలో అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. సైన్స్ టీచర్‌ను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.


