News February 7, 2025
కోవ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738845882458_50103613-normal-WIFI.webp)
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కోవ లక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల సేవకు అంకితమై సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సుధీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు.
Similar News
News February 7, 2025
సిరిసిల్ల: కుక్కల వల్ల చిన్నారికి సోకిన వైరస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738890748344_1259-normal-WIFI.webp)
కోనరావుపేట(M) కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ(4) అనే చిన్నారికి జ్వరంతో పాటు శరీరంపై అలర్జీ ఏర్పడింది. అవి ఎక్కువ కావడంతో చిన్నారిని సిరిసిల్లలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్నిరకాల పరీక్షలు చేసినా నిర్ధారణ కాకపోవడంతో 4రోజుల క్రితం HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రూసెల్లా ఇథి పీకల్ వైరస్ గా గుర్తించారు. కుక్కల కారణంగా ఈ వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు.
News February 7, 2025
గుంటూరు: కూతురి పట్ల అసభ్య ప్రవర్తన.. తండ్రిపై దాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738883414867_60415181-normal-WIFI.webp)
కూతురిని అసభ్యకరంగా దూషించి ఆమె తండ్రిపై దాడి చేసిన ముగ్గురు యువకులపై పట్టాభిపురం పీఎస్లో కేసు నమోదైంది. విద్యానగర్ 1వ లైన్ శివారు మార్గం ద్వారా ఒక వ్యక్తి తమ కుమార్తె వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించిన యువకులు అతని కుమార్తెను దూషించారు. అనంతరం ఆమె తండ్రి ఆ యువకులను మందలించడంతో మద్యం సీసాతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 7, 2025
లింగంపాలెం: వ్యక్తి అనుమానాస్పద మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738887226097_52302764-normal-WIFI.webp)
లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామంలో రామస్వామి (45) అనే వ్యక్తి గురువారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రామస్వామి చావుకి అదే గ్రామానికి చెందిన కొందరు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. లింగపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.