News February 7, 2025

కోవ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత

image

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కోవ లక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల సేవకు అంకితమై సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సుధీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు.

Similar News

News February 7, 2026

పెద్దపల్లి: విజయవంతంగా ఉపాధి అవగాహన కార్యక్రమం

image

పెద్దపల్లి టాస్క్ రీజియన్ సెంటర్లో శనివారం జిల్లాస్థాయి ఉపాధి అవగాహన, బ్యాంకింగ్ అవేర్నెస్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్ తెలిపారు. ఉపాధి అవకాశాలు, కెరీర్ ప్రణాళిక, పోటీ పరీక్షలపై మార్గ నిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

News February 7, 2026

ఉప్పల్‌లో రేపు మెగా సెమినార్

image

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. ఉప్పల్ భగాయత్‌లోని SriRasthu Convention‌లో రేపు ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు

News February 7, 2026

పుత్తూరులో ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి సూసైడ్

image

పుత్తూరు పట్టణంలో శనివారం హృదయ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కృష్ణానగర్ నందు నివాసం ఉంటున్న తల్లి, ఇద్దరు బిడ్డలు ఉరివేసుకొని మృతి చెందారు. పైడిపల్లికి చెందిన శివ, నేశనురూకు పద్మ (భార్య) ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొన్నారు. వీరికి లాస్య (7), తేజశ్రీ(5) ఇద్దరు ఆడపిల్లలు. శనివారం భర్త లేని సమయంలో పద్మ, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉరివేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.