News January 25, 2025
కోస్గి: కొడంగల్‌కు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాఈ నెల 26న అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తుకు సిద్ధమవుతున్నారు.
Similar News
News November 1, 2025
ఈ వృక్షాన్ని పూజిస్తే.. కుబేరుడి అనుగ్రహం

పవిత్ర ప్రబోధిని ఏకాదశి రోజున కదంబ వృక్షాన్ని పూజిస్తే విష్ణువు కటాక్షం తప్పక లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ దేవతా వృక్షం శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆయన ఈ చెట్టు కిందే వేణువు వాయించేవాడని పురాణాల వాక్కు. అందుకే ఈ చెట్టుకు ప్రభోధిని ఏకాదశి రోజున పూజ చేయాలని చెబుతారు. పసుపు, పువ్వులు సమర్పించి భక్తితో పూజిస్తే అదృష్టంతో పాటు కుబేరుడి అనుగ్రహం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
News November 1, 2025
POKలో మానవహక్కుల ఉల్లంఘన: UNలో భారత్ ఫైర్

పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లో ప్రజల తిరుగుబాటును అక్కడి దళాలు అణచివేస్తున్నాయని UN వేదికగా భారత్ ఫైరయ్యింది. అక్కడ తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని IND దౌత్యవేత్త భావికా మంగళానందన్ ధ్వజమెత్తారు. అక్కడి దారుణాలను ఆపకుండా భారత్‌పై నిందలు మోపేందుకు ఆ దేశ దౌత్యవేత్తలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పాక్ కపట వైఖరి అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.
News November 1, 2025
సిటీ ఆర్టీసీ బస్సులో ఫైర్ ప్రొటెక్షన్ యంత్రాలు

కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో నగరంలోని సిటీ బస్సుల్లో ఫైర్ ప్రొటెక్షన్ యంత్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రోడీలక్స్ బస్సులలో ఫైర్ ఎగ్జిటింగిషర్స్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. బస్సుల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వీటిని ఉపయోగించి మంటలను ఆర్పవచ్చు.


