News August 17, 2024
కోస్గి: జాబ్ మేళాలో 491 మందికి ఉద్యోగాలు

కోస్గి పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. మేళాలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 1800 మంది నిరుద్యోగులు హాజరు కాగా వారిలో వివిధ కంపెనీలు, సంస్థల్లో 491 మందికి ఉద్యోగాలు లభించాయని అన్నారు. మరికొంత మందికి రెండవ విడత ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారని అన్నారు. ఎంపికైన వారికి ఎస్పీ ఎంపిక పత్రాలను అందజేశారు.
Similar News
News January 7, 2026
MBNR: రేపు క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్

K12 టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో HYD,MBNR బ్రాంచ్ కోసం PROలు, PRM ఖాళీలు ఉన్నాయని పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ ఎన్ అర్జున్ కుమార్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 8న క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్” నిర్వహిస్తున్నామని, పీయూలో MBA,MCA పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, పూర్తి వివరాలకు 98494 45877కు సంప్రదించాలన్నారు.
News January 7, 2026
MBNR: సంక్రాంతి పండుగ.. NH-43 పై నిఘా..!

సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్ర రాజధాని సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి నేషనల్ హైవే–44 పరిధిలోని బాలానగర్ ఫ్లైఓవర్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బాలానగర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న కారణంగా ప్రయాణికులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
News January 7, 2026
MBNR: పీఎంశ్రీ క్రీడా పోటీలు.. విజేతలు వీరే!

మహబూబ్ నగర్ జిల్లాలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. వివరాలు ఇలా!!
✒ కబడ్డీ (బాలుర)
1st- బాదేపల్లి, 2nd- గార్లపాడు
✒ కబడ్డీ (బాలికల)
1st- బాలానగర్, 2nd- వాపుల
✒ వాలీబాల్ (బాలుర)
విజేత- బాదేపల్లి, రన్నర్‌గా- వేముల
✒ వాలీబాల్ (బాలికల)
విజేత- బాలానగర్ (గురుకుల), రన్నర్‌గా-సీసీ కుంట(KGBV)


