News February 15, 2025
కోస్గి: రహదారి విస్తరణ పనులపై సమావేశం

కోస్గి పట్టణంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులపై శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులు, ప్రధాన రహదారి వెంబడి ఇల్లు కోల్పోతున్న వారితో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమావేశం నిర్వహించారు. రహదారి నిర్మాణంలో ఆస్తి నష్టం తక్కువగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. 165 మంది బాధితులు ప్రభుత్వం అందించే నష్టపరిహారం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు వివరించారు.
Similar News
News November 14, 2025
ఇక బెంగాల్ వంతు: కేంద్ర మంత్రి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, ఇక తర్వాతి లక్ష్యం పశ్చిమ బెంగాల్ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ‘అరాచక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని బిహార్ నిర్ణయించుకుంది. ఇక్కడి యువత తెలివైనది. ఇది అభివృద్ధి సాధించిన విజయం. బెంగాల్లో అరాచక ప్రభుత్వం ఉంది. అక్కడా మేం గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా వచ్చే ఏడాది బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
News November 14, 2025
కోరుట్ల నుంచి RTC వన్డే SPL. TOUR

కోరుట్ల నుంచి ఈనెల 16న మాహోర్కు స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉదయం 4 గంటలకు బస్సు బయలుదేరి రేణుకా మాతా(మావురాల ఎల్లమ్మ, పరశురామ), దత్తాత్రేయ పీఠం, ఏకవీర శక్తిపీఠం, ఉంకేశ్వర్- శివాలయం దర్శనాల అనంతరం బస్సు తిరిగి రాత్రి కోరుట్లకు చేరుతుందన్నారు. ఛార్జీలు ఒక్కరికి రూ.1,250గా నిర్ణయించారు. వివరాలకు 996361503 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News November 14, 2025
మూడేళ్లలో విశాఖలో లూలూ మాల్

మూడేళ్లలో విశాఖలో ‘లూలూ’ మాల్‌ను పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ యూసఫ్ అలీ తెలిపారు. CII సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 2018లో మాల్‌కు శంకుస్థాపన చేశామన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పలు కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. ఈ మాల్ ద్వారా ప్రత్యక్షంగా 5వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.


