News April 24, 2024
కోహిర్‌లో హత్య కేసు UPDATE..

సంగారెడ్డి జిల్లా <<13106901>>కోహిర్‌లో హత్య<<>>కు కారకులైన నిందితులను పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాలు.. HYD జగద్గిరిగుట్టకు చెందిన అన్వర్ ఆలీని గురుజవాడకు చెందిన మహమ్మద్ కైఫ్, రాజనెల్లికి చెందిన ముస్తకిం కలిసి కత్తితో దాడి చేసి చంపేశారు. ముగ్గురు కలిసి తరచూ దొంగతనాలు చేసేవారు. అయితే సోమవారం రాత్రి మద్యం తాగి గొడవ దిగారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి అన్వర్‌ను హత్య చేశారని జహీరాబాద్ పట్టణ సీఐ రవి తెలిపారు.
Similar News
News February 12, 2026
మెదక్ జిల్లాలో 4 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో గోల్డ్ బంగ్లా వెస్లీ కళాశాల, నర్సాపూర్‌లో BVRIT, తూప్రాన్‌లో నోబుల్ ఫార్మా కళాశాల, రామాయంపేటలో ఎంపీడీవో కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం నుండే ఈ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.
News February 12, 2026
MDK: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి నేడు OD

నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు ఓడీ సౌకర్యం కల్పిస్తున్నట్లు MDK జిల్లా విద్యాధికారి విజయ తెలిపారు. విధుల్లో ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, కౌంటింగ్ ట్రైనింగ్ ఉన్న సిబ్బంది మాత్రం తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలని సూచించారు. పాఠశాలల నిర్వహణకు ఆటంకం కలగకుండా హెచ్‌ఎంలు, ఎంఈఓలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 12, 2026
మెదక్: ఓటు వేసేందుకు రాష్ట్రం దాటాడు

ఓటుపై తనకున్న బాధ్యతను చాటుకున్నాడో యువకుడు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ పట్టణంలోని 22వ వార్డుకు చెందిన రవితేజ(26) ఏపీలోని తెనాలి నుంచి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అక్కడ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవితేజ, తన విలువైన ఓటును వేసేందుకు రాష్ట్రం దాటి సొంతూరికి చేరుకున్నాడు. ఈ యువకుడి చొరవను పలువురు అభినందించారు.


