News June 4, 2024
కౌంటింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ

నేడు కడపలో జరగబోయే ఎన్నికల కౌంటింగ్‌కు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు. కడప ఎన్నికల కౌంటింగ్ కేంద్ర వద్ద అధికారులకు దిశానిర్దేశం చేశారు. గొడవలకు ఎవరు ప్రయత్నించినా కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. కౌంటింగ్ పాసులు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించేది లేదన్నారు.
Similar News
News December 18, 2025
కడప మీదుగా ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి నుంచి కడప మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంటకల్ రైల్వే డివిజనల్ అధికారులు తెలిపారు. ఈనెల 20 ఉదయం 8:15 నిమిషాలకు రైలు బయలుదేరి రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్, రాయచూర్, సికింద్రాబాద్, నాగపూర్, భోపాల్ మీదుగా ప్రయాగరాజ్ చేరుకుంటుంది.
News December 18, 2025
కడప జిల్లాలో లక్ష్యానికి దూరంగా AMCల రాబడి

కడప జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి 2025-26లో రూ.13.53 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. నవంబర్ చివరి నాటికి రూ.7.09 కోట్లు (52.44%) మాత్రమే వసూలైంది (రూ.కోట్లలో). కడప – 1.54, ప్రొద్దుటూరు – 0.71, బద్వేల్ – 1.20, జమ్మలమడుగు – 0.42, పులివెందుల – 0.67, మైదుకూరు – 1.44, కమలాపురం – 0.44, సిద్దవటం – 0.13, ఎర్రగుంట్ల – 0.38, సింహాద్రిపురం – 0.12 మాత్రమే వసూలైంది.
News December 17, 2025
ఖాజీపేట: కానిస్టేబుల్ జాబ్ కొట్టిన హోమ్ గార్డు కుమారుడు

ఖాజీపేట పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్‌గా పనిచేస్తున్న ప్రసాద్ కుమారుడు పవన్ కళ్యాణ్ పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో బుధవారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సీఐ వంశీధర్ పవన్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి పోలీస్ యూనిఫామ్ అందజేశారు. విధి నిర్వహణలో ప్రజలకు మంచి సేవలు అందించి ఉన్నతంగా రాణించాలని సూచించారు.


