News May 24, 2024

కౌంటింగ్‌కు రాజకీయ పార్టీల శ్రేణులు సహకరించాలి: ఢిల్లీరావు

image

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేయడంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల శ్రేణులు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో కలెక్టరేట్లో నేడు ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులకు ఈవీఎంలో నమోదైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించే విధానంలో వివిధ దశలను క్షుణ్నంగా వివరించినట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News February 14, 2025

వల్లభనేని వంశీ అరెస్ట్.. ‘నానీ’లు సైలెంట్

image

వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించడంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సైలెంట్ అయ్యారు. వీరిద్దరు సైలెంట్ అవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత YCP ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొడాలి, పేర్ని, జోగి రమేశ్‌తో పాటు వల్లభనేని వంశీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకొక్కరిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వంశీ అరెస్ట్ అయ్యారు. 

News February 14, 2025

కృష్ణా: నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది వీరేనా.?

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో అదే పార్టీకి చెందిన కొందరు వైసీపీ నాయకులపై కూడా కేసులో ఉన్నాయి. వీరిని కూడా ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఆయనే సూత్రధారుడని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పేర్ని నాని బియ్యం మాయం కేసులో బెయిల్‌పై ఉన్నారు. 

News February 14, 2025

కృష్ణా: రీ సర్వే సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ నంబర్

image

జిల్లాలో భూముల రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు అమలవుతున్న 23 గ్రామాలలో రైతులు సందేహాల నివృత్తి కోసం జిల్లా సర్వే కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఈ సర్వే మీద రైతులకు సందేహాలు, సమస్యలు ఉంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు 9492271542 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

error: Content is protected !!