News May 24, 2024
కౌంటింగ్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చెయ్యండి: కలెక్టర్

కౌంటింగ్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూములో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల లైవ్ ఫీడ్‌ను పరిశీలించారు. అనంతరం ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. జేసీ మౌర్య, ట్రైనీ కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 18, 2025
రాయలసీమ యూనివర్సిటీ వీసీగా వెంకట బసవరావు

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ప్రొఫెసర్ డాక్టర్ వెంకట బసవరావు నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటీఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన త్వరలోనే వీసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కాగా వెంకట బసవరావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా, పలు విభాగాలకు HODగా విధులు నిర్వహించారు.
News February 18, 2025
గుండెపోటుతో దేవనకొండ హెచ్ఎం మృతి

దేవనకొండ మండల కేంద్రంలోని ఎంపీపీ స్కూల్లో (మెయిన్) విధులు నిర్వహిస్తున్న హెచ్ఎం పద్మావతి సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. దేవనకొండలో బుధవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆమె భర్త రఘునాథ్ తెలిపారు. ఈ ఘటనతో దేవనకొండలో విషాదఛాయలు అమలుకున్నాయి. ఉపాధ్యాయులు శ్రద్ధాంజలి ఘటించారు.
News February 18, 2025
టైరు పేలి టాటా ఏస్ బోల్తా

వెల్దుర్తి మండల సమీపంలోని అల్లుగుండు పెట్రోల్ బంక్ దగ్గర నేషనల్ హైవేపై మంగళవారం టైరు పేలి టాటా ఏస్ బోల్తా పడింది. కర్నూలు మార్కెట్‌కు వేరుశనగ కాయలు తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారని పేర్కొన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.