News May 25, 2024
కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి: ఎస్పీ

మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ శనివారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. అనుమతి లేని వాహనాలను, వ్యక్తులను కౌంటింగ్ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Similar News
News September 17, 2025
కృష్ణా: రైలులో గంజాయి అక్రమ రవాణా.. ఒకరి అరెస్ట్

కృష్ణా జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో, బిలాస్పూర్ నుంచి తిరుపతి వెళ్లే రైలులో 4.5 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని రామవరప్పాడు రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. నిందితుడిని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఒరిస్సాలోని చాట్ల గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి, చిత్తూరు జిల్లాలో విక్రయిస్తున్నట్లు అతడు తెలిపాడు.
News September 17, 2025
MTM: YS జగన్ ఫొటోలతో సర్టిఫికేట్లు.. ఉద్యోగులు సస్పెండ్

బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిథిలో మాజీ సీఎం జగన్ ఫొటోతో ఉన్న కుల, ఆదాయ సర్టిఫికేట్లు జారీ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పెద్దింట్లమ్మ, పంచాయతీ కార్యదర్శి రవి శంకర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
News September 16, 2025
బందరు: జగన్ ఫోటోతో INCOME సర్టిఫికేట్ జారీ

బందరు మండలం తాళ్లపాలెం సచివాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటోతో ఇన్కమ్ సర్టిఫికేట్ జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వం మారినా రాష్ట్రంలో అక్కడక్కడ జగన్ ఫోటోలతో కూడిన సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల గుంటూరులో జగన్ ఫోటోతో సచివాలయ సిబ్బంది సర్టిఫికేట్ జారీ చేయడాన్ని మరువక ముందే నేడు బందరు మండలం తాళ్లపాలెం సచివాలయంలో జగన్ ఫోటోతో సర్టిఫికేట్ జారీ విమర్శలకు తావిస్తోంది.