News May 26, 2024
కౌంటింగ్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

ఈనెల 4న రాయలసీమ యూనివర్సిటీలో జరుగునున్న ఎన్నికల కౌంటింగ్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన, ఎస్పీ కృష్ణకాంత్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో చర్చించారు. కౌంటింగ్ నిర్వహణలో, భద్రతలో ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News February 13, 2025
కర్నూలు జిల్లాలో ఉరేసుకుని వివాహిత మృతి

కర్నూలు జిల్లా పెద్ద తుంబలం గ్రామంలో విషాద ఘటన జరిగింది. 21ఏళ్ల వివాహిత అనూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అనూష, శాంతరాజును ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా విషాదం నింపింది. అనూష మృతికి కుటుంబ ఆర్థిక సమస్యలు కారణమా? గృహ కలహాలా? లేక మరేదైనా కారణమా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
News February 13, 2025
కర్నూలు: టెన్త్ అర్హత.. 70 కంపెనీల్లో ఉద్యోగాలు

ఆలూరులోని ఇబ్రహీం ఫంక్షన్ హాలులో ఈ నెల 20న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు బహుజన టైమ్స్ సభ్యుడు దుర్గాప్రసాద్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దాదాపు 70 కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొంటారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 13, 2025
ఎమ్మిగనూరులో పర్యటించిన ఎస్పీ, మాజీ ఐజీ ఇక్బాల్

ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల పాఠశాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్, రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ సందర్శించారు. ఇక్బాల్ మాట్లాడుతూ.. బాలికలకు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థానాల్లో ఉండాలని, మహిళలు ఎందులో తక్కువ కాదని నిరూపించాలని అన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. బాలికలు పాఠశాలకు వస్తున్న సమయంలో గానీ, బయట గానీ ఎవరైనా ఆకతాయిలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.