News May 19, 2024

కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి: వికాస్ మర్మత్

image

నెల్లూరులో జరగనున్న కౌంటింగ్ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ ఎన్నికల అధికారులకు సూచించారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని ఆయన ఛాంబర్‌లో శనివారం నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు

Similar News

News December 11, 2024

వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం రాష్ర్టంలో ఏమైంది: ఎంపీ

image

ఆంధ్రప్రదేశ్‌లో ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం అమలు గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో వివరాలు కోరారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరు చేసిన, కేటాయించిన, వినియోగించిన నిధుల వివరాలు, రాష్ట్రంలో పథకం కింద నిర్ణయించిన లక్ష్యాలు ఏ మేరకు ఫలితాలనిచ్చాయి, రాష్ట్రంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డులు ఎంతవరకు విజయవంతంగా నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించారు.

News December 11, 2024

పవన్ కళ్యాణ్‌ను చంపేస్తానన్న వ్యక్తిది నెల్లూరే..!

image

పవన్ కళ్యాణ్‌ను చంపేస్తానని <<14834003>>హత్యా బెదిరింపులకు<<>> పాల్పడిన వ్యక్తి నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావుగా పోలీసులు గుర్తించారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. మల్లికార్జున రావు మద్యం మత్తులో విజయవాడ నుంచి బెదిరింపు కాల్స్ చేసినట్లు గుర్తించారు. గతంలో అతనిపై ఓ కేసు నమోదైనట్లు సమాచారం. మరోవైపు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.

News December 11, 2024

వ్యభిచారం కేసులో నెల్లూరు వాసుల అరెస్ట్

image

తిరుపతి బస్టాండ్ సమీపంలో వ్యభిచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు(D) పొదలకూరు(M) డేగపూడికి చెందిన గోవర్ధన్ రెడ్డి, అనంతమడుగు వాసి మద్దాలి వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తికి చెందిన గుడాల గురవయ్య జయశ్యాం థియేటర్ వీధిలోని లాడ్జిలో గది తీసుకున్నారు. అక్కడ ఓ మహిళను ఉంచి వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా సమాచారంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు దాడి చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు.