News February 25, 2025

కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమర్ధవంతంగా నిర్వహించాలని ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మీ ఆదేశించారు. కౌంటింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులు, పర్యవేక్షణ అధికారులకు సోమవారం కలెక్టరేట్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో అభ్యర్ధి విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఒక్క ఓటు అధికంగా రావాల్సి ఉందన్నారు. ఓట్లు లెక్కింపు కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

Similar News

News February 25, 2025

గుంటూరు : ఘోర ప్రమాదం..  మృతులు వీరే..!

image

గుంటూరులోని గోరంట్లలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతులు తల్లీ, కూతురుగా పోలీసులు నిర్ధారించారు. అడవితక్కెళ్లపాడు టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న వింజమూరి నాగలక్ష్మి (38), చరణ్య (14) లు చిల్లీస్ రెస్టారెంట్ వద్ద రహదారిని క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు నల్లపాడు పోలీసులు తెలిపారు.

News February 25, 2025

గుంటూరులో లారీ ఢీకొని ఇద్దరు మృతి

image

గోరంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో లారీ ఢీ కొని ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. అమరావతి నుంచి గుంటూరు నగరంలోకి వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో నల్లపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 

News February 25, 2025

మిర్చి రైతులకు మద్దతు ధర: మంత్రి లోకేశ్

image

రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం CBN చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి లోకేశ్ తెలిపారు. సోమవారం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేలా మిర్చి రైతులకు క్వింటా కనీస మద్దతు ధర రూ.11,781లు చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిందని మంత్రి అన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.

error: Content is protected !!