News May 26, 2024

కౌంటింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. నంద్యాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ సిబ్బందికి ఆదివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధులకు తప్పకుండా హాజరు కావాలన్నారు. నిర్దేశించిన సమయానికి అందరూ తప్పనిసరిగా కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు.

Similar News

News October 10, 2024

ఆదోని: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆదోని మండలం సాదాపురం క్రాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని అంజి(48) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కొంతకాలంగా పెట్రోల్ బంక్‌లో జీవనం సాగిస్తున్నాడు. వేకువజామున టీ తాగడానికి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కోమాలోకి వెళ్లాడు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బంధువులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలిస్తుండగా మృతి చెందాడు.

News October 10, 2024

రతన్ టాటా మృతి ఎంతో బాధాకరం: మంత్రి టీజీ భరత్

image

టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతి ప‌ట్ల మంత్రి టీజీ భ‌ర‌త్ సంతాపం వ్య‌క్తం చేశారు. ర‌త‌న్ టాటా మ‌ర‌ణ‌వార్త త‌న‌ను ఎంతో దిగ్బ్రాంతికి గురిచేసింద‌న్నారు. ర‌త‌న్ టాటా ఆలోచ‌నా విధానంతో టాటా గ్రూప్‌ను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లార‌ని చెప్పారు. ఆయ‌న‌ ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పి లక్షలాది మంది యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించార‌ని కొనియాడారు.

News October 10, 2024

నంద్యాల: భోధనంలో పిడుగు

image

బండిఆత్మకూరు మండలం భోధనం గ్రామంలో గురువారం మధ్యాహ్నం పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం వర్షానికి ముందు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగు పడింది. ఎవరూ లేని చోట ఉన్న వృక్షంపై పిడుగు పడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని గ్రామస్థులు తెలిపారు.