News May 26, 2024
కౌంటింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. నంద్యాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ సిబ్బందికి ఆదివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ విధులకు తప్పకుండా హాజరు కావాలన్నారు. నిర్దేశించిన సమయానికి అందరూ తప్పనిసరిగా కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు.
Similar News
News February 12, 2025
మార్కెట్లోకి BE6, XEV9 కార్లు

అనంతపురం MGB మొబైల్స్ మహీంద్రా బ్రాంచ్ ప్రతినిధులు BEV BE6, XEV9E మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేశారు. మహీంద్రా AI ఆర్కిటెక్చర్, 110 cm వైడ్ సినిమా స్కోప్ లగ్జరీ డిస్‌ప్లేతో పాటు Z క్లాస్ సెక్యూరిటీతో 5 కెమెరాలను కలిగి ఉంది. ఆటో పార్కింగ్ సదుపాయం కూడా ఉండగా దీని ధర రూ.18.9 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని అన్నారు. ఏపీలో దీనిపై లైఫ్ టాక్స్ లేదు.
News February 12, 2025
సంగమేశ్వరం.. ఇక్కడ అన్నీ ప్రత్యేకతలే!

ఆలయాల్లో ఎక్కడైనా ఏడాది పొడవునా దర్శనం ఉంటుంది. కానీ సంగమేశ్వరంలో గుడి ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తుంది. ప్రపంచంలోనే ఏడు నదులు ఒకేచోట కలిసే ప్రదేశం సంగమేశ్వరం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే పుణ్య ప్రదేశం ఇదే. వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన వేప శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు.
News February 12, 2025
డబ్బులిస్తే ఉద్యోగాలు రావు: కర్నూలు ఎస్పీ

డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావని, పోటీ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు మధ్యవర్తుల ద్వారా రావని, నిరుద్యోగ యువత యామ మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. నమ్మించి మోసాలు చేసే వారితో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.