News May 24, 2024
కౌంటింగ్ సిబ్బంది నియామకం: కలెక్టర్ గౌతమ్

లోకసభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాoడమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఖమ్మం లోకసభ సాధారణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో ఆన్లైన్ ద్వారా పూర్తి పారదర్శకంగా ర్యాoడమైజేషన్ చేపట్టి పూర్తి చేశారు. కౌంటింగ్ కొరకు రిజర్వ్ తో కలిపి 148 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 173 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 150 మంది సూక్ష్మ పరిశీలకులు నియమించినట్లు చెప్పారు.
Similar News
News December 5, 2025
ఖమ్మంలో సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి: ఎంపీ

వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న ఖమ్మంలో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణంలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి ఎంపీ రైల్వే సమస్యలపై వినతి పత్రం అందించారు. ఇరుముడి ధరించి, అయ్యప్ప సన్నిధానం శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఖమ్మంలో కేరళ ఎక్స్ ప్రెస్కు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని కోరారు.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. BNSS 163 యాక్ట్ అమలు: సీపీ

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత పోలింగ్ జరిగే కొణిజర్ల, రఘునాథపాలెం, బోనకల్లు, వైరా, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలలో సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని పేర్కొన్నారు.
News December 5, 2025
బెల్టు షాపులపై దాడులు.. రూ.35 వేల మద్యం సీజ్

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు మండలాల్లోని బెల్టు షాపులపై టాస్క్ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించినట్లు ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. కొణిజర్ల, రఘునాథపాలెం, చింతకాని సహా 7 మండలాల్లో దాడులు నిర్వహించి, సుమారు రూ.35 వేల విలువ గల దాదాపు 600 లీటర్లు ఐఎంఎఫ్ఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


