News January 23, 2025
కౌకుంట్ల : పేరూరులో సభ.. సద్వినియోగం చేసుకోండి

కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో నేడు ఉదయం 10:00 గంటలకు నిర్వహించే గ్రామ సభలో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జీ. మధుసుధన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐ సీసీ సెక్రటరీ, తెలంగాణ ఇన్‌ఛార్జ్ విశ్వనాథ్ అదే పాల్గొంటారు. ఈ సభను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఆత్మీయ బరోసా కు వినతి పత్రాలను ఇవ్వాలన్నారు.
Similar News
News October 14, 2025
MBNR: ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం.. UPDATE!

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు.
✒ ఫొటోగ్రఫీ
అంశం: పోలీస్ సేవలు, త్యాగాలు/ప్రజా రక్షణ
ఫొటోలు: గరిష్ఠంగా 3
ఫొటో సైజు: 10×8 ఇంచులు
✒ షార్ట్ ఫిలిం
వ్యవధి: గరిష్ఠంగా 3Mits
థీమ్: పోలీస్ సేవలు, కర్తవ్య నిబద్ధత/సమాజ రక్షణ.. దగ్గరలోని పోలీస్ స్టేషన్లో మీ పూర్తి వివరాలతో పాటు ఫొటోలు, షార్ట్ ఫిలిం(పెన్ డ్రైవ్ రూపంలో) అందజేయాలి.
News October 14, 2025
MBNR: పోలీస్ ఫ్లాగ్ డే.. ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం: SP

పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకుని నిర్వహించే ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలలో పాల్గొనాలని ఎస్పీ డి.జానకి యువత, విద్యార్థులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు పిలుపునిచ్చారు. పోలీస్ సేవలు, త్యాగాలు, సమాజ రక్షణలో పోలీసులు పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిబింబించేలా తమ ప్రతిభను ప్రదర్శించాలని ఆమె కోరారు. ఈ నెల 23వ తేదీ లోగా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో తమ రచనలు/చిత్రాలను సమర్పించాలని ఎస్పీ సూచించారు.
News October 14, 2025
MBNR: తుమ్మల క్షమాపణ చెప్పాలి: మాజీ మంత్రి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మానవత్వం ఉందా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కమ్మ సామాజికవర్గం ఓట్లతోనే తుమ్మల మంత్రి అయ్యారన్నారు. మాగంటి సునీత ఎమ్మెల్యే భర్త మరణిస్తే వచ్చిన ఉపఎన్నికలో ఆమె బిడ్డలు, కొడుకు ప్రచారం చేయడంపై అభ్యంతరం ఏంటని నిలదీశారు. తుమ్మల నాగేశ్వరరావు వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.