News March 15, 2025
కౌటాల: గ్రూప్-3లో 3వ ర్యాంకు

కౌటాల మండలం గుడ్లబోరికి చెందిన కామ్రే భాస్కర్ ఇటీవల విడుదల చేసిన <<15731644>>గ్రూప్-2లో 381మార్కులతో 229 ర్యాంకు సాధించారు.<<>> కాగా నిన్న విడుదల చేసిన గ్రూప్-3 ఫలితాల్లోనూ 296.1 మార్కులతో 154వ ర్యాంకు సాధించారు. 2016లో సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందిన భాస్కర్ ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా వున్నారు. చిన్ననాటి నుంచే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో పోటీ పరీక్షలకు సిద్ధమైనట్లు తెలిపారు.
Similar News
News March 15, 2025
నిజామాబాద్: ఇంటర్ పరీక్షల్లో 364 మంది విద్యార్థులు గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ రెండవ సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ-2 పరీక్షకు మొత్తం 364 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 14,472 మంది విద్యార్థులకు 14,108 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని అధికారులు వివరించారు.
News March 15, 2025
నంద్యాల తాగునీటి సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష

నంద్యాల జిల్లాలో తాగునీటి సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యపై జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News March 15, 2025
తూ.గో జిల్లా ప్రజలకు గమనిక

వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లపై తూ.గో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్.సురేశ్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాలను పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. ఇకపై ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్టిఫికెట్లు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలోని ప్రజలు రాజానగరంలోని కంట్రోల్ అల్ట్ ఫిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సంప్రదించి సర్టిఫికెట్లు తీసుకోవాలన్నారు.