News January 28, 2025

కౌటాల: టీచర్ పోస్ట్ కోసం 8 నెలల గర్భవతి పోరాటం

image

మండలానికి చెందిన జ్యోత్స్న ఇటీవల విడుదల చేసిన డీఎస్సీలో 1:1తో సెలెక్ట్ అయినట్లు ఆమె పేర్కొన్నారు. సీఎం చేతుల మీదుగా ఆర్డర్ కాపీని తీసుకున్నానని ఆమె చెప్పారు. అన్ని అర్హతలు ఉన్నా తనను కాదని తన కొలువును 13వ ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తూ కోర్టులో కేసు వేశానని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతి పత్రం ఇచ్చినట్లు చెప్పారు.

Similar News

News November 15, 2025

తూ.గో: సదరం క్యాంపులు ప్రారంభం

image

తూ.గో జిల్లా వ్యాప్తంగా కొత్త సదరం సర్టిఫికెట్ల జారీ కోసం స్లాట్‌ బుకింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైందని DCHS డా.ఎం.పద్మ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ప్రతి మంగళవారం ఏరియా హాస్పిటళ్లు, జిల్లా ఆసుపత్రులు, GGHల్లో సదరం సర్టిఫికెట్ల కోసం స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని చెప్పారు.

News November 15, 2025

సిద్దిపేట: C-section ప్రసవాలను తగ్గించాలి: కలెక్టర్

image

C- సెక్షన్ ప్రసవాలను తగ్గించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్య అధికారులతో ప్రజలకు అందిస్తున్న వివిధ ఆరోగ్య సేవల పైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా పూర్వ డెంగ్యూ కేసుల ఫాలో అప్ నిర్వహణ పైన రివ్యూ నిర్వహించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు.

News November 15, 2025

కరీంనగర్: బ్లూ కోల్ట్స్ విభాగంలో మహిళ పోలీస్ కానిస్టేబుళ్లు సత్తా

image

బ్లూ కోల్ట్స్ విభాగంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని మహిళ పోలీస్ కానిస్టేబుళ్లు రాణిస్తున్నారు. 2016లో అప్పటి సీపీ కమలహాసన్ రెడ్డి పురుషల బ్లూ కోల్ట్స్‌ను ప్రారంభించారు. మహిళా పోలీసుల సంఖ్య క్రమంగా పెరగడంతో సీపీ గౌష్ ఆలం సెప్టెంబర్‌లో మహిళ బ్లూ కోల్ట్స్ సేవలను ప్రారంభించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, కమ్యూనిటీ సమావేశాలుతో పాటు అన్ని విభాగాలలో పురుష పోలీసులతో సమానంగా రాణిస్తున్నారు.