News January 28, 2025

కౌటాల: టీచర్ పోస్ట్ కోసం 8 నెలల గర్భవతి పోరాటం

image

కౌటాలకు చెందిన జ్యోత్స్న ఇటీవల విడుదల చేసిన డీఎస్సీలో 1:1తో సెలక్టయినట్లు ఆమె పేర్కొన్నారు. సీఎం చేతుల మీదుగా ఆర్డర్ కాపీని తీసుకున్నానని, అన్ని అర్హతలు ఉన్నా తనను కాదని తన కొలువును 13వ ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తూ కోర్టులో కేసు వేశానని, ఉద్యోగం కోసం 8 నెలల గర్భంతో అవస్థలు పడుతూ ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చానన్నారు.

Similar News

News July 11, 2025

MBNR: పల్లె పోరు.. రిజర్వేషన్ల ఫీవర్

image

ఆగస్టు నెలాఖరు కల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయా నేతల్లో రిజర్వేషన్ల భయం పట్టుకుంది. ఏ రిజర్వేషన్ వస్తదో అని చర్చించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 1,684 గ్రామపంచాయతీలు ఉండగా.. 23,22,054 మంది పల్లెల్లో ఓటర్లు ఉన్నారు. 74 ZPTC స్థానాలతో పాటు 19 పురపాలికలున్నాయి.

News July 11, 2025

రాజంపేట: యువకుల మిస్సింగ్‌పై పవన్‌కు ఫిర్యాదు

image

రాజంపేటకు చెందిన ముగ్గురు యువకులు థాయిలాండ్‌లో ఉద్యోగానికి వెళ్లి అదృశ్యమయ్యారు. వాళ్ల అచూకీ కనిపెట్టాలని రాజంపేటకు చెందిన పూజారి గిరిజా కుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌ను కోరారు. ఆయనకు యువకుల వివరాలు అందజేశారు. మహిళ ఫిర్యాదుతో డిప్యూటీ సీఎం కేంద్రంతో మాట్లాడారు. రాజంపేటలోని ఎస్వీ నగర్‌కు చెందిన ఓ యువకుడితో మరో ఇద్దరు 3నెలల కిందట థాయిలాండ్ వెళ్లగా వాళ్ల ఆచూకీ లభించలేదు.

News July 11, 2025

సారవకోట: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో..ఒకరి మృతి

image

సారవకోట(M) కృష్ణాపురం సమీపంలో రహదారిపై గురువారం ఆగి ఉన్న లారీను వెనక నుంచి ఆటో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అమ్మనమ్మ (56) మృతి చెందింది. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.