News January 28, 2025
కౌటాల: టీచర్ పోస్ట్ కోసం 8 నెలల గర్భవతి పోరాటం

మండలానికి చెందిన జ్యోత్స్న ఇటీవల విడుదల చేసిన డీఎస్సీలో 1:1తో సెలెక్ట్ అయినట్లు ఆమె పేర్కొన్నారు. సీఎం చేతుల మీదుగా ఆర్డర్ కాపీని తీసుకున్నానని ఆమె చెప్పారు. అన్ని అర్హతలు ఉన్నా తనను కాదని తన కొలువును 13వ ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తూ కోర్టులో కేసు వేశానని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతి పత్రం ఇచ్చినట్లు చెప్పారు.
Similar News
News February 14, 2025
అల్లాదుర్గం: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

అల్లాదుర్గం మండలం సీతానగర్ గ్రామ శివారులో రోడ్డు పక్క అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు కాగితంపల్లి గ్రామానికి చెందిన ముసిరిగారి మల్లయ్యగా స్థానికులు గుర్తించారు. మల్లయ్య కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించిస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.
News February 14, 2025
మద్యం తాగేవాళ్లలో తెలంగాణ వారే టాప్

సౌత్ ఇండియాలో TGలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని రాజ్యసభలో మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. అదే సమయంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య తగ్గిందని తెలిపారు. 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం APలో 34.9%, TGలో 53.8% మంది పురుషులు మద్యం సేవించేవారని వివరించారు. 2019-21 నాటికి ఇది APలో 31.2%, TGలో 50శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు.
News February 14, 2025
భర్త వేధింపులకు నవ వధువు ఆత్మహత్య

గోపాలపట్నంలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. నాగేంద్రబాబు, వసంత 11 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పోర్న్ వీడియోలకు బానిసైన నాగేంద్ర భార్య వసంతను అదేవిధంగా చేయాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన వసంత శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని KGHకి తరలించారు.