News January 31, 2025

కౌటాల మండంలో పర్యటించిన TGNPDCL CMD

image

కౌటాల మండల కేంద్రంలో పనులు జరుగుతున్న 132/33 సబ్ స్టేషన్‌ను గురువారం విద్యుత్ శాఖ సీఎండీ వరుణ్ రెడ్డి తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 వరకు సబ్ స్టేషన్ పనులు పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు. దీంతో సిర్పూరు (టీ), కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాలకు విద్యుత్ సమస్యలు తీరుతాయన్నారు. CE అశోక్, DE సంపత్ రెడ్డి, వివిధ మండలాల విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు.

Similar News

News December 10, 2025

నేడు జగ్గన్నతోట ప్రబల తీర్థంపై సమావేశం

image

అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో 11 గ్రామాలకు చెందిన ఏకాదశ రుద్రులు కొలువు తీరే ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించనుంది. నాలుగున్నర శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ తీర్థం నిర్వహణ సమీపిస్తుండటంతో ఆర్డీఓ శ్రీకర్ సారధ్యంలో అధికారులు బుధవారం మొసలపల్లిలో ఉత్సవ కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. లక్షలాది మంది తరలి వచ్చే తీర్థం ఏర్పాట్లపై సమావేశంలో సమీక్షించనున్నారు.

News December 10, 2025

గొడవలు ఎందుకొస్తాయంటే?

image

ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే గొడవలు రావడానికి కారణం కమ్యునికేషన్ లేకపోవడం. సరైన సంభాషణ జరగనప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం కూడా కలుగుతుంది. అలానే ఒకరి భావాలు మరొకరికి తప్పుగా అర్థం అవుతాయి. కాబట్టి కమ్యునికేషన్ బావుండేలా చూసుకోవడం మంచిది. ఇలా కూడా సగం గొడవలు కంట్రోల్ అవుతాయి. సరిగ్గా మాట్లాడడం, ఓపెన్‌గా మాట్లాడడటం వల్ల గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

News December 10, 2025

కాశీలో శని దోషాలు పోగొట్టే ఆలయం

image

కాశీలో విశ్వేశ్వరుడు, విశాలాక్షి దేవి ఆలయాలతో పాటు అన్నపూర్ణాదేవి గుడి కూడా ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే ఆహారానికి లోటుండదని నమ్మకం. అలాగే సంకట మోచన్ హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తే సంకటాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి దర్శనంతో ఏలినాటి శని దోషాలు పోతాయని అంటున్నారు. భక్తులు మణికర్ణికా, దశాశ్వమేధ ఘాట్‌లు దర్శించి గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు.