News January 31, 2025
కౌటాల మండంలో పర్యటించిన TGNPDCL CMD

కౌటాల మండల కేంద్రంలో పనులు జరుగుతున్న 132/33 సబ్ స్టేషన్‌ను గురువారం విద్యుత్ శాఖ సీఎండీ వరుణ్ రెడ్డి తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 వరకు సబ్ స్టేషన్ పనులు పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు. దీంతో సిర్పూరు (టీ), కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాలకు విద్యుత్ సమస్యలు తీరుతాయన్నారు. CE అశోక్, DE సంపత్ రెడ్డి, వివిధ మండలాల విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు.
Similar News
News February 15, 2025
ఎంతో చేయాలని ఉంది.. కానీ గల్లా పెట్టె సహకరించట్లేదు: సీఎం

AP: అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో సంపద పెరగలేదని, రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇంకా ఎంతో చేయాలని ఉందని, కానీ గల్లా పెట్టె సహకరించడం లేదన్నారు.
News February 15, 2025
చిరంజీవి లుక్ అదిరిందిగా!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ జరుగుతున్నట్లు తెలుపుతూ మేకర్స్ ఓ ఫొటో పంచుకోగా వైరలవుతోంది. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చిరును షూటింగ్ సెట్స్‌లో కలవగా.. మరో డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. నుదిటిపై బొట్టుతో ఇంద్రసేనా రెడ్డిలా కనిపించారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
News February 15, 2025
ఆ ముగ్గురికి ఛాంపియన్స్ ట్రోఫీనే లాస్ట్: చోప్రా

రోహిత్, విరాట్, జడేజాకు ఛాంపియన్స్ ట్రోఫీనే చివరి ICC ఈవెంట్ అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. బరువెక్కిన హృదయంతో తాను ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. తరచూ వస్తున్న రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో వీరు 2027 వన్డే WC వరకు కొనసాగకపోవచ్చని తెలిపారు. వచ్చే ఏడాది టీ20 WC ఉన్నా రోహిత్, కోహ్లీ, జడేజా ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని చోప్రా గుర్తు చేశారు.