News August 24, 2024
కౌడిపల్లి: పాముకాటుతో బాలిక మృతి
పాము కాటుతో బాలిక మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఈరోజు జరిగింది. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. మండల పరిధిలోని భుజరంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి(12) ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో అర్ధరాత్రి పాము కాటుకు గురైంది. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 19, 2024
MDK: వచ్చే నెల 3 నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో వచ్చే నెల 3 నుంచి 9 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. అక్టోబరు 16 నుంచి 23 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఆయా విద్యాసంస్థల్లో సంప్రదించాలని ఆయన కోరారు.
News September 19, 2024
సిద్దిపేట: అథ్లెటిక్ పోటీల్లో సత్తాచాటిన చింతమడక విద్యార్థినిలు
సిద్దిపేట డిగ్రీ కళాశాలలో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో చింతమడక జడ్పీ పాఠశాలలో విద్యార్థినులు సత్తా చాటారు. 8వ తరగతి చదువుతున్న దుంపటి రుక్మిత అండర్-1480 మీటర్ల, జెళ్ల అవంతిక 3000 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ ఇద్దరూ ఈనెల 19 నుంచి 29 వరకు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని HM కొత్త రాజిరెడ్డి తెలిపారు.
-CONGRATS
News September 18, 2024
దుబ్బాక వస్త్రాలంకరణలో అయోధ్య బాల రాముడు
అయోధ్య బాలరాముడిని సిద్దిపేట చేనేత వస్త్రాలతో మనోహరంగా అలంకరించారు. దుబ్బాకలోని హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ తయారు చేసిన చేనేత వస్ర్తాలతో నిన్న బాల రాముడు మెరిసిపోయారు. చేనేత మగ్గాలపై 80/100 లియా లెనిని ఫ్యాబ్రిక్‌తో గల 16 మీటర్ల తెలుపు రంగు వస్ర్తాన్ని తయారు చేసి అందజేసినట్టు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బోడ శ్రీనివాస్ తెలిపారు.