News April 29, 2024
కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం: CBN

చంద్రబాబు ఆదివారం కౌతాళపురంలో ప్రజాగళం సభను నిర్వహించారు. అందులో మంత్రాలయం, ఆదోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై ఇసుక దోపిడీదారులని, ప్రజల రక్తాన్ని పీల్చే వ్యక్తులని, రోడ్డు, నీరు, అభివృద్ధి చేయలేని అసమర్ధులని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను, కౌతాళంలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై మీ అభిప్రాయం?
Similar News
News April 16, 2026
దేవమ్మ మడుగులో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

దేవమ్మ మడుగులో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు మండలం ఆర్.కె.దుద్యాల సమీపంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఇసుక అక్రమ తరలింపు, నీటి నిల్వ సామర్థ్యం, తాగునీటి సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

జిల్లాలో వాట్సప్ గవర్నెన్స్ సేవలను పెంచాలి: కలెక్టర్ సిరి

‘మన మిత్ర’ యాప్ ద్వారా జిల్లాలో వాట్సప్ గవర్నెన్స్ సేవలను విస్తరించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పౌర సేవలు, స్వీయ గణనపై సమీక్షించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందేలా యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. సాంకేతికతను ఉపయోగించుకుని పాలనను మరింత చేరువ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.