News January 11, 2025

కౌతాళం మండలంలో మహిళ హత్య

image

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో దారుణ హత్య జరిగింది. కర్ణాటక సరిహద్దు సుళేకేరి గ్రామానికి చెందిన బసమ్మ (52)కు భర్త కురువ మారెప్ప మృతి చెందడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఆమె శుక్రవారం ఉదయం ఉచిత గ్యాస్ కోసం హచ్చోళ్లికి బయలుదేరగా మురవణి గ్రామ పొలాల్లో హత్యకు గురైంది. దుండగులు గొంతుకోసి హత్య హత్యచేసినట్లు సమాచారం. ఘటనపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 25, 2025

కర్నూలు SP స్పందనకు 95 ఫిర్యాదులు

image

కర్నూలులో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 95 ఫిర్యాదులు స్వీకరించినట్టు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజలను ప్రత్యక్షంగా కలసి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ, పోలీసు అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News November 24, 2025

లింగ సమానత్వానికి కృషి చేయాలి: కర్నూలు కలెక్టర్

image

సమాజంలో లింగ సమానత్వ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “జెండర్ సమానత్వం” జాతీయ ప్రచార పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా “నయీ చేతన 4.0 –మార్పు కోసం ముందడుగు” పేరుతో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు.