News February 9, 2025

కౌలాస్ కోటను సందర్శించిన KMR ఎస్పీ

image

జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలోని అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కౌలాస్ కోటను కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదివారం సందర్శించారు. కోటలో ఆమె మూడు గంటల పాటు తిరిగి పురాతన నిర్మాణాలను, భారీ ఫిరంగిని తిలకించారు. కోట వెలుపల ఉన్న అష్ట భుజ మాత మందిరాన్ని సందర్శించి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోట అందాలు, కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని ఆమె అభివర్ణించారు.

Similar News

News March 24, 2025

HYD MMTSలో యువతిపై అత్యాచారయత్నం

image

సికింద్రాబాద్ TO మేడ్చల్ MMTSలో ఓ యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించగా.. కదులుతున్న ట్రెయిన్‌లో నుంచి ఆ యువతి దూకేసింది. తీవ్రగాయాలైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 24, 2025

తాడేపల్లి: మహిళ హత్య.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన SP

image

తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలనుకొండ వద్ద మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపిన ప్రాంతాన్ని ఆదివారం రాత్రి గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతంచేయాలని, నేరస్థులను గుర్తించి త్వరితగతిన అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు ఎస్పీ వెంట ఉన్నారు. 

News March 24, 2025

పాలకుర్తి: జాగృతి పోలీస్ కళా బృందం అవగాహన

image

పాలకుర్తి మండలం రాఘవపురం గ్రామంలో జాగృతి పోలీస్ కళా బృందం వారు పలు అంశాలపై గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదివారం ఈ సందర్భంగా చదువు, రోడ్డు ప్రమాదాలు, డయల్ 100, ఈవ్ టీజింగ్, సీసీ కెమెరాలు, షీ టీం, గుట్కా, గంజాయి, డ్రగ్స్ వాటి లాభ నష్టాల గురించి ఆటపాట రూపంలో వివరించారు. ఎస్ఐ లింగారెడ్డి, సంపత్, రాజ్ కుమార్, సూర్య, ప్రకాష్, రవి, మారయ్య తదితరులున్నారు.

error: Content is protected !!