News September 11, 2024
కౌలు రైతుల రుణాలను ముమ్మరం చేయాలి: కలెక్టర్
విజయనగరం జిల్లాలో కౌలు రైతులకు రుణాలు అందించే కార్యక్రమాన్ని బ్యాంకులు మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులకు రుణాలు అందించే కార్యక్రమంపై డీసీసీ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. 2,333 మందికి కౌలు రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తులు పంపించామని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రామారావు వివరించారు.
Similar News
News October 4, 2024
విజయనగరం: TODAY TOP NEWS
➣ రామతీర్థంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
➣ భోగాపురం: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
➣ గజపతినగరం: పాముకాటుతో రైతు మృతి
➣ పైడితల్లమ్మ హుండీల్లో నకిలీ నోట్లు
➣ 151 నుంచి 11 సీట్లుకు దిగిపోయారు: కిమిడి నాగార్జున
➣ పొలాల్లోకి దూసుకెళ్లిన విజయనగరం- రాజాం BUS
➣ ఒమ్మిలో పసుపు కొమ్ములతో అమ్మవారి విగ్రహం
➣ పార్వతీపురం జిల్లాలో 7,83,972 మంది ఓటర్లు
News October 3, 2024
VZM: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
భోగాపురం పోలీస్ స్టేషన్ లో 2021లో నమోదైన హత్య కేసు నిందితుడికి జిల్లా మహిళ కోర్టు జీవిత ఖైదు, రూ. 2,500 జరిమానా విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కొంగవానిపాలెంకు చెందిన గోవింద మద్యం మత్తులో భార్య మంగమ్మను హత్య చేశాడని, మృతిరాలి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించామన్నారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారైందని చెప్పారు.
News October 3, 2024
సాలూరు- విశాఖ వయా బొబ్బిలి.. రేపే ట్రైల్ రన్
కొన్నేళ్ల నుంచి ట్రైన్ సాలూరు వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజలకు శుక్రవారం ట్రైల్ రన్ నిర్వహిస్తున్నట్లుగా తెలియ వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై 12.30కు బొబ్బిలి 1.10 కి సాలూరు చేరుకుని తిరుగు ప్రయాణమై సాయంత్రం 4.30 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రైల్వే అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.