News February 13, 2026

కౌశిక్ రెడ్డికి షాక్.. హుజూరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ వశం

image

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి సొంత గడ్డపై భంగపాటు తప్పలేదు. హుజూరాబాద్‌ పురపాలక పీఠాన్ని కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకుంది. మొత్తం 30 వార్డులకు గాను కాంగ్రెస్‌ 16 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా.. బీఆర్ఎస్ 8, బీజేపీ 5 స్థానాలకే పరిమితమయ్యాయి. 19వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మెజారిటీ స్థానాలను గెలుచుకోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి.

Similar News

News March 14, 2026

హార్ముజ్ దాటిన భారత నౌకలు.. మొత్తం 86వేల టన్నుల LPG

image

భారత్‌కు చెందిన మరో LPG క్యారియర్ హార్ముజ్ జలసంధిని దాటినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక వస్తోందని, దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోందని పేర్కొన్నాయి. మరో రెండు రోజుల్లో ముంబై లేదా కాండ్లా(గుజరాత్) ఓడరేవుకు చేరుకోనుంది. మరో షిప్ ‘శివాలిక్’ నిన్నే హార్ముజ్‌ను దాటిందని, అందులో 40వేల టన్నుల LPG ఉందని CNN NEWS 18 తెలిపింది.

News March 14, 2026

BIG SCREENపై ఆదిలాబాద్ యువకులు

image

ఇటీవల విడుదలైన ఓ చిత్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు మెరిశారు. గుడిహత్నూర్ రైతు బిడ్డ అనికేత్ గిట్టేతో పాటు పట్టణానికి చెందిన జగత్ ప్రతాప్, నిహల్ సింగ్, ధీరజ్ జాట్, ప్రవీణ్ జోష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో కొద్ది నిమిషాల పాటు వీరు వెండితెరపై కనిపించి అలరించారు. జిల్లా యువత ప్రతిభను చాటడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 14, 2026

తిరుపతి: హాల్ టికెట్ ఉంటే ఫ్రీ జర్నీ

image

తిరుపతి జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. బస్సులో హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుంది. పరీక్షల రోజుల్లో అదనపు ట్రిప్పులు నడపాలని తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.జగదీష్ డిపో మేనేజర్లను ఆదేశించారు.