News March 22, 2024
క్యాంప్ కార్యాలయం బోర్డు మార్చిన భద్రాచలం ఎమ్మెల్యే
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తుంది. కాగా భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసిఆర్‌తో ఉన్న బోర్డును తొలగించి, ఆయన ఒక్కరే ఉన్న ఫోటో ఫ్లెక్సీ బోర్డును అమర్చారు. బోర్డు మార్పుతో పార్టీ చేరిక ఖరారు అయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని రెండుసార్లు కలిశారు.
Similar News
News September 20, 2024
మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగింది: మంత్రి పొంగులేటి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పేరుతో భారీ అవినీతి జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. భగీరథలో జరిగిన అవినీతి గురించి ప్రజలకు తేలియాజేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 53 శాతం మంది ప్రజలకు మంచినీరు అందలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందరికి మంచినీరు అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
News September 19, 2024
సాగర్ ఎడమ కాలువ గండ్లను పూడ్చాలి: మంత్రి తుమ్మల
సాగర్ ఎడమ కాలువ గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. తుపాను ప్రభావంతో వరదల వల్ల నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండ్లు పడ్డాయని, కాలువ మరమ్మతు పనులు త్వరగా చేపట్టాలని తుమ్మల కోరారు. చివరి ఆయకట్టు రైతులకు నీరందించడామే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పనులను వేగవంతం చేయాలని తుమ్మల అన్నారు.
News September 19, 2024
వరద బాధితులకు నెల జీతం చెక్ అందించిన కూనంనేని
ఖమ్మం వరద బాధితులకు సహాయార్థం తన నెల జీతాన్ని అందజేస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి నెల జీతం చెక్కును అందజేశారు. సీఎం సహాయనిధి ద్వారా వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.