News February 14, 2025
క్యాన్సర్ అవగాహన 5కే వాకథాన్, సైకిల్ ర్యాలీ ప్రారంభం

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా టాటా క్యాన్సర్ హాస్పిటల్ (స్వీకార్) ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన 5కే వాకథాన్, సైకిల్ ర్యాలీ ప్రారంభమైంది. నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరై జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి,టాటా క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందం, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 17, 2025
ఎల్లారెడ్డిపేట: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ ఎన్నికలలో భాగంగా ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, అల్మాస్ పూర్, గొల్లపల్లి, వీర్నపల్లి మండలంలోని కంచర్ల, వీర్నపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలో ఆవరణ, కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.
News December 17, 2025
కామారెడ్డి జిల్లాలో మూడో విడత తొలి ఫలితం

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. అంకోల్ క్యాంప్ సర్పంచ్గా అనిత-రాములు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అనితకు 209 మెజారిటీ వచ్చింది. తన సమీప ప్రత్యర్థి సావిత్రికి 36 ఓట్లు వచ్చాయి. 3 ఓట్లు చెల్లలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
News December 17, 2025
పెద్దపల్లి జిల్లాలో ఓటింగ్ నమోదు ఎంతంటే..?

పెద్దపల్లి జిల్లాలోనీ గ్రామ పంచాయతీలలో ఉదయం ప్రారంభమైన పోలింగ్ ఒంటి గంటకు పూర్తయింది. పెద్దపల్లి మండలంలో 80.5%, సుల్తానాబాద్ మండలంలో 84.51%, ఎలిగేడు మండలంలో 83.02%, ఓదెల మండలంలో 82.85% నమోదు కాగా, మొత్తం పెద్దపల్లి జిల్లాలో 82.34% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు.


