News March 25, 2025

క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు

image

పలిమెల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన నితిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంత్రి శ్రీధర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి తానున్నానని భరోసా కల్పించారు. ‘సార్.. నేను మంచి క్రికెటర్ కావాలనుకున్నా, క్రికెట్ కిట్ ఇప్పించండి’ అని నితిన్‌ అనడంతో శ్రీధర్ బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రికెట్ కిట్ తెప్పించి అతడి కోరికను తీర్చారు.

Similar News

News April 2, 2025

మగవారితో పోలిస్తే అతివల్లో ఎక్కువ నిద్రలేమి

image

ఆరోగ్యానికి చక్కటి నిద్ర అత్యవసరం. కానీ పురుషులతో పోలిస్తే మహిళల్లో నిద్రలేమి ఎక్కువ ఉందని USకు చెందిన ‘రెస్‌మెడ్’ సంస్థ అధ్యయనంలో తేలింది. దాని ప్రకారం.. వారంలో పురుషులు సగటున 4.13 రాత్రుళ్లు హాయిగా నిద్రపోతుంటే స్త్రీలు 3.83 రాత్రుళ్లు మాత్రమే సరైన నిద్రపోతున్నారు. హార్మోన్ల మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళనల వంటి కారణాలు స్త్రీల నిద్రని ప్రభావితం చేస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.

News April 2, 2025

HCU భూముల వివాదంపై సెలబ్రిటీల స్పందన

image

హెచ్‌సీయూ భూముల వివాదంపై సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇషా రెబ్బా, రేణూ దేశాయ్, ప్రియదర్శి, ఉపాసన కొణిదెల, కావ్య కళ్యాణ్‌రామ్, రష్మీ గౌతమ్, అభినవ్ గోమఠం, నోయెల్ షాన్, ప్రియాంక జవాల్కర్ తమ ఇన్‌స్టాల్లో హెచ్‌సీయూ భూముల్ని, అక్కడి ప్రాణుల్ని కాపాడాలనే అర్థంలో స్టోరీలు పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

News April 2, 2025

BREAKING: పంజాబ్ ఘన విజయం

image

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో ఛేదించింది. ప్రభుసిమ్రన్ సింగ్ 69, శ్రేయస్ అయ్యర్ 52*, వధేరా 43* రన్స్ చేశారు. లక్నో బౌలర్ దిగ్వేశ్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు LSG బ్యాటర్లలో పూరన్ 44, బదోనీ 41, మార్‌క్రమ్ 28, సమద్ 27, మిల్లర్ 19 రన్స్ చేశారు. అర్ష్‌దీప్ 3, ఫెర్గూసన్, మ్యాక్స్‌వెల్, మార్కో, చాహల్ తలో వికెట్ తీశారు.

error: Content is protected !!