News February 3, 2025
క్యాన్సర్ లక్షణాలు ఉంటే పరీక్షించుకోవాలి: దేశ్ పాండే

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, న్యాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి దేశ్ పాండే మాట్లాడుతూ.. రోజురోజుకూ వివిధ రకాలైన క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. క్యాన్సర్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షించుకోవాలని, తద్వారా నయం చేయవచ్చన్నారు.
Similar News
News October 18, 2025
ఇవాళ ఒక్కరోజే 23వేల అప్లికేషన్లు

TG: లిక్కర్ షాప్స్‌కు ఈరోజు రికార్డు స్థాయిలో అప్లికేషన్స్ వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇవాళ ఒక్కరోజే 23 వేల దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం 50వేలు దాటాయని పేర్కొంది. శనివారం చివరి రోజు కావడంతో మరో 50 వేలు అప్లికేషన్స్ వస్తాయని అంచనా వేస్తోంది. కాగా రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.
News October 18, 2025
కండ్లపల్లి చెరువు కట్ట పరిశీలన.. డ్యామ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

జగిత్యాల శివారులోని కండ్లపల్లి చెరువు కట్ట ఇటీవల కుంగిపోయి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం కట్టను పరిశీలించారు. చెరువు కట్ట మరమ్మతులకు సంబంధించి తక్షణం చేపట్టవలసిన పనులను సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు వారు సూచించారు. ఈ తనిఖీలో విశ్రాంత ఎన్సీ రామరాజు, సేఫ్టీ అధికారిణి విజయలక్ష్మి, నీటిపారుదల శాఖ ఈఈ ఖాన్, జియాలజిస్ట్ పద్మరాజు పాల్గొన్నారు.
News October 18, 2025
జగిత్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాల్లో టార్ఫాలిన్, వెయింగ్, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు సిద్ధం చేయాలని, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, కొనుగోలు వెంటనే ట్యాబ్ ఎంట్రీ, నగదు/బోనస్ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.