News January 3, 2025

క్యాలెండర్లను ఆవిష్కరించిన మంత్రి కొండా

image

సచివాలయంలో తెలంగాణ బయో డైవర్సిటి బోర్డ్ నూతన క్యాలెండర్లను అధికారులతో కలిసి మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. అంతకుముందు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు మంత్రిని కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పిసిసిఎఫ్(హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్, తెలంగాణ బయోడైవర్సిటి బోర్డు ఛైర్మన్ కాళిచరణ్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 22, 2025

వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) ధర నిన్న రూ. 2,535 పలకగా.. నేడు రూ.2,450కి పడిపోయింది. అలాగే, పాత తేజా మిర్చి ధర రూ.13,400, పాత 341 రకం మిర్చి ధర రూ.14,300, పాత వండర్ హాట్ మిర్చి రూ.14,500, 5531 మిర్చి రూ.12వేలు పలికినట్లు అధికారులు పేర్కొన్నారు.

News January 22, 2025

కొత్తగూడ: కొడుకు దశదిన కర్మ రోజే తల్లి మృతి

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బూర్గుంపులో విషాదం నెలకొంది. కొడుకు చనిపోయిన రోజుల వ్యవధిలోనే తల్లి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గట్టి నరేశ్ అనారోగ్యంతో పది రోజుల కిందట మృతి చెందాడు. ఆయన తల్లి యాకమ్మ కొన్ని రోజులుగా పక్షవాతంతో మంచాన పడింది. కొడుకు మృతితో మనస్తాపం చెందిన యాకమ్మ.. ఆయన దశదిన కర్మ రోజే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News January 22, 2025

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంలతో అప్రమత్తంగా ఉండాలి: వరంగల్‌ సీపీ

image

మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్‌ సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్‌ నేరగాళ్లు కొత్త పోకడలు, మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీంలతో పాటు పిరమిడ్‌ లాంటి స్కీంల ద్వారా ప్రజల సొమ్ము దోచేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.