News March 11, 2025
క్యూట్.. Pic Of The Day

కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ ఓ చిన్నారిని ఎత్తుకుని ఆడించారు. పర్యటన ముగించుకుని వెళ్తున్న క్రమంలో తన కాన్వాయ్ వద్దకు అభిమానులు చిన్నారిని తీసుకొచ్చారు. ఆయన చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. ఇందుకు సంబంధించిన క్యూట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిక్ ఆఫ్ ది డే అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
రంప: పాఠశాలలో ఆడుకుంటు..కుప్పకూలిన విద్యార్థిని

రంపచోడవరం మండలం తామరపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. 4వ తరగతి విద్యార్థిని కె. జానుశ్రీ పాఠశాలలో తోటి విద్యార్థులతో ఆడుకుంటుండగా..ఫీట్స్ వచ్చి పడి పోయింది. బాలిక పేరెంట్స్, టీచర్స్ హుటాహుటిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారరు.
News December 5, 2025
ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఫుడ్స్ ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో ఉండే బిస్పినాల్ ఏ (BPA) రసాయనం ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS సమస్యలు, టైప్ 2 డయాబెటిస్, నాడీ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News December 5, 2025
సిరిసిల్ల: మానేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మానేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం శుక్రవారం లభ్యమయింది. అటుగా వెళుతున్న వాహనదారులు మృతదేహాన్ని చూసి ఫొటోలు, వీడియోలు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. మృతదేహానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


