News March 11, 2025
క్యూట్.. Pic Of The Day

కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ ఓ చిన్నారిని ఎత్తుకుని ఆడించారు. పర్యటన ముగించుకుని వెళ్తున్న క్రమంలో తన కాన్వాయ్ వద్దకు అభిమానులు చిన్నారిని తీసుకొచ్చారు. ఆయన చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. ఇందుకు సంబంధించిన క్యూట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిక్ ఆఫ్ ది డే అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Similar News
News March 27, 2025
ఉప్పల్‌లో SRH, మహేశ్ బాబు FANS

ఉప్పల్ స్టేడియం వద్ద SRH, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పలువురు యువత ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్, మహేశ్ బాబు బ్యానర్‌తో స్టేడియానికి చేరుకున్నారు. ఈ సారి SRH బ్యాటింగ్‌కు దిగితే 300 స్కోర్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
News March 27, 2025
డీప్ ఫేక్‌పై నటి, ఎంపీ ఆందోళన

డీప్ ఫేక్‌పై నటి, ఎంపీ హేమామాలిని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సాంకేతికతతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. దీంతో పేరు, ప్రఖ్యాతుల కోసం పడిన కష్టమంతా దెబ్బతింటుందని చెప్పారు. అనేక మంది దీని బారిన పడ్డారని చెప్పారు. ఈ అంశాన్ని తేలికగా తీసుకోవద్దని లోక్‌సభలో వ్యాఖ్యానించారు. రష్మిక, విద్యా బాలన్ వంటి నటులు డీప్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే.
News March 27, 2025
GWL: ‘రంగారెడ్డికి నీళ్లు.. పాలమూరు రైతులకు కన్నీళ్లు’

పాలమూరు నుంచి రంగారెడ్డికి సాగునీరు తరలించి ఇక్కడి రైతులకు కన్నీళ్లు మిగిల్చారని MLC చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శాసనమండలిలో గురువారం మాట్లాడుతూ.. కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డను సస్య శ్యామలం చేసేందుకు ఇక్కడి ప్రాజెక్టులు ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలన్నారు. రెండు నదుల మధ్య ఉండి సాగునీటికి ఏపీ ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన చెందారు.