News March 9, 2025
క్రికెటర్ ఇంట్లో ఇఫ్తార్ విందు.. పాల్గొన్న ఎమ్మెల్యే

టీం ఇండియన్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ శనివారం తన నివాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో నాంపల్లి MIM ఎమ్మెల్యే మహమ్మద్ మజీద్ హుస్సేన్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ చేశారు. ఈ విందుకు సిరాజ్, కుటుంబసభ్యులు, బంధువులతో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు.
Similar News
News October 28, 2025
HYD: చున్నీతో గొంతు బిగించి భర్తను చంపింది..!

HYD బాలాపూర్ మండలం మీర్పేట్ PS పరిధిలో విజయ్ కుమార్ అనుమానాస్పద మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్మార్టం నివేదికలో హత్యగా నిర్ధారణ కావడంతో భార్య సంధ్య నిందితురాలని తేలింది. మద్యం తాగి, వేధించే భర్తతో నిత్యం గొడవ జరుగుతుండడంతో అక్టోబర్ 19న చున్నీతో గొంతు బిగించి చంపినట్లు సంధ్య ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
News October 27, 2025
మద్యం షాపుల కేటాయింపునకు డ్రా పూర్తి: HYD కలెక్టర్

హైదరాబాద్లో 82, సికింద్రాబాద్లో 97 మద్యం షాపుల కేటాయింపునకు డ్రా పూర్తయిందని జిల్లా కలెక్టర్ హరిచందన వెల్లడించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ భవన్లో లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు జరిపారు. నూతన ఎక్సైజ్ పాలసీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశామన్నారు. రానున్న 2 సంవత్సరాలకు షాపులు కేటాయించినట్లు తెలిపారు.
News October 27, 2025
జూబ్లీహిల్స్లో ఎవరి పంతం నెగ్గుతుందో..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయమే కాదు PJR పిల్లల మధ్య కూడా నువ్వానేనా అన్నట్లుగా మారింది. స్థానిక ప్రజలకు PJR అంటే ఎనలేని అభిమానం. కాగా ఆయన కుమారుడు, మాజీ MLA విష్ణువర్ధన్ రెడ్డి BRSలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎగరనీయనని అంటున్నారు. PJR కుమార్తె, కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. BRSను ఓడగొడతామంటున్నారు. మరి ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.


