News July 2, 2024
క్రికెట్ ఆడిన అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం నగరంలోని పిటిసి క్రీడా మైదానంలో మంగళవారం వికసిత్ భారత్ స్పోర్ట్స్ ఫెస్ట్ 2024 క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వైద్యులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. వైద్యులు కూడా క్రీడలు ఆడడం అవసరమని పేర్కొన్నారు. క్రీడలు ఆడటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.
Similar News
News September 17, 2025
పంట నమోదుకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశం

పంట నమోదుకు ఈనెల 30వ తేదీ చివరి గడువు అని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. బుక్కరాయసముద్రం మండలంలో పర్యటించి, రైతులను పంట వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. 2025-26 సంవత్సరం PM కిషన్ అన్నదాత సుఖీభవ పథకంలో రెండో విడత అక్టోబర్‌లో విడుదల చేస్తామని చెప్పారు. అకౌంట్ నంబర్‌ను మొబైల్ నంబర్‌తో లింక్ చేసుకోవాలని సూచించారు.
News September 17, 2025
డీఎస్సీలు అభ్యర్థులకు ఈనెల 19న నియామక పత్రాలు: డీఈవో

అనంతపురం జిల్లాలో డీఎస్సీలో 755 మంది ఉద్యోగాలు సాధించిన సంగతి తెలిసిందే. డీఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు DEO ప్రసాద్ బాబు తెలిపారు. 75 మందిని అమరావతికి తీసుకెళ్లేందుకు 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు రేపు ఉదయం 6 గంటలకు అనంతపురంలోని PVKK కళాశాలకు చేరుకోవాలని సూచించారు.
News September 17, 2025
సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించిన చైనా ప్రతినిధి బృందం

అనంతపురం జిల్లా జంతలూరులోని AP సెంట్రల్ యూనివర్సిటీని న్యూఢిల్లీ చైనా రాయబార కార్యాలయం ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది. కౌన్సిలర్ యాంగ్ షీయుహువా, జాంగ్ హైలిన్, సూ చెన్, ఫాంగ్ బిన్ CUAP ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరిని కలిశారు. విద్యలో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థులకు చైనా విద్యా వ్యవస్థ, ప్రభుత్వ ఉపకారవేతన పథకాల గురించి వివరించారు.