News January 3, 2025

క్రికెట్ జట్టుకు హైదరాబాద్ కుర్రాడు

image

HYDకు చెందిన మరో క్రికెటర్ సత్తా చాటుతున్నాడు. ఎల్బీనగర్‌ వాసి రాపోల్ సాయి సంతోష్ దేశవాళీ 2024-25 సీజన్‌లో అరుణాచల్ ప్రదేశ్ అండర్-23 క్రికెట్ టీమ్‌కు ఎంపికయ్యాడు. BCCI మెన్స్ అండర్-23 స్టేట్-ఏ ట్రోఫీ కోసం జరగనున్న పోటీలకు అరుణాచల్ ప్రదేశ్ జట్టు తరఫున ఆడనున్నాడు. 21 ఏళ్ల సంతోష్ జట్టులో ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నాడు. గతంలో జాతీయ స్థాయి అండర్-16,17 గేమ్స్‌లో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

Similar News

News October 21, 2025

HYD: సదర్ ఉత్సవం.. దద్దరిల్లనున్న సిటీ

image

HYDలో యాదవులు నేడు సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. దీపావళి తర్వాత జరిగే ఈ పండుగ కోసం ఖైరతాబాద్, బోయిన్‌పల్లి, మూసాపేట్ వంటి ప్రాంతాలు సిద్ధమయ్యాయి. హరియాణా నుంచి భారీ దున్నరాజులు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. యాదవ సోదరులు తమ దున్నరాజులతో డప్పులు, ఆటపాటల నడుమ ఊరేగింపుగా వచ్చి, ఒకచోట సదర్‌ను జరుపుకుంటారు.

News October 21, 2025

HYD: సదర్.. దున్నరాజుకు రూ.31 వేల మద్యం

image

ముషీరాబాద్‌లో సదర్ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో కేరళ నుంచి తెచ్చిన 2,500 కిలోల ‘దున్నరాజు’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉత్సవంలో యాదవులు రూ.31,000 విలువైన ‘రాయల్ సెల్యూట్’ బాటిల్‌ను దున్నరాజుకు తాగించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో సదర్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయి.

News October 21, 2025

HYD: పోలీస్ బాస్.. మీ సేవలకు సెల్యూట్

image

నిజాయితీకి ప్రతీక, ధైర్యానికి పర్యాయపదం ఉమేశ్ చంద్ర ఐపీఎస్. వరంగల్‌లో ASPగా నక్సలైట్లను అణచివేశారు. కడప SPగా ఫ్యాక్షన్‌ను కట్టడి చేసి ‘కడప సింహం’గా ఖ్యాతి గడించారు. కరీంనగర్‌లో శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించారు. చివరగా AIGగా సేవలందించారు. ప్రజల కోసం పోరాడి ‘ప్రజల పోలీస్’గా పేరుగాంచారు. ఆయన బదిలీ వార్తపై ప్రజలు రోడ్డెక్కి కన్నీరు పెట్టారు. 1999 SEP 4న HYD SRనగర్‌లో నక్సలైట్ల దాడిలో కన్నుమూశారు.