News February 9, 2025
క్రికెట్ టోర్నమెంట్లో సూర్యాపేట స్ట్రైకర్స్ విజయం

ఎస్బీఐ ఇంట్రారీజియన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను ఎస్బీఐ రీజినల్ మేనేజర్ వై. ఉపేంద్ర భాస్కర్ శనివారం ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్యాంకింగ్ బ్లాస్టర్స్ 100 పరుగులు చేయగా, సూర్యాపేట స్ట్రైకర్స్ బ్యాట్స్మెన్ ఏఎన్ఆర్ చివరి మూడు బంతుల్లో 13 పరుగులు చేసి 101 పరుగులతో సూర్యాపేట స్ట్రైకర్స్ జట్టును విజేతగా నిలిపారు.
Similar News
News January 9, 2026
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీకి షాక్

తెలంగాణలో ‘రాజాసాబ్’ సినిమా విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రీమియర్స్ ఆలస్యం కావడంతో ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలు సాధారణ ధరలకే టికెట్ల బుకింగ్ ప్రారంభించాయి.
News January 9, 2026
నల్గొండ: ‘నో హెల్మెట్-నో పెట్రోల్’.. వ్యాపారులకు ఫుల్ డిమాండ్

జిల్లాలో ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ నిబంధనను పోలీసులు కఠినంగా అమలు చేస్తుండటంతో హెల్మెట్ వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది. హెల్మెట్ ఉంటేనే బంకుల్లో ఇంధనం పోయాలని ఎస్పీ కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ షాపులకు క్యూ కడుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా హెల్మెట్లకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News January 9, 2026
TGలో ‘రాజాసాబ్’ బుకింగ్స్ ప్రారంభం

తెలంగాణలో ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈరోజు రాత్రి 11.30 గంటల ప్రీమియర్ షోకు సంబంధించిన టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్లో అందుబాటులోకి వచ్చాయి. అటు ఏపీలో 9pmకే ప్రీమియర్స్ ప్రారంభం కాగా, థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.


