News February 9, 2025

క్రికెట్ టోర్నమెంట్‌లో సూర్యాపేట స్ట్రైకర్స్ విజయం

image

ఎస్బీఐ ఇంట్రారీజియన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఎస్బీఐ రీజినల్ మేనేజర్ వై. ఉపేంద్ర భాస్కర్ శనివారం ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్యాంకింగ్ బ్లాస్టర్స్ 100 పరుగులు చేయగా, సూర్యాపేట స్ట్రైకర్స్ బ్యాట్స్‌మెన్ ఏఎన్ఆర్ చివరి మూడు బంతుల్లో 13 పరుగులు చేసి 101 పరుగులతో సూర్యాపేట స్ట్రైకర్స్ జట్టును విజేతగా నిలిపారు.

Similar News

News November 7, 2025

శ్రీ సత్యసాయి జిల్లా ఏఎస్పీగా అంకిత మహవీర్

image

పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా అంకిత సురానా మహవీర్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతామని, మహిళలు, చిన్నారుల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని ఏఎస్పీ ఎస్పీ పేర్కొన్నారు. తొలుత ఎస్పీ కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు.

News November 7, 2025

ఖమ్మం: వందేమాతరం గీతాలాపనలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.శ్రీజ, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.శ్రీజ మాట్లాడుతూ.. కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు.

News November 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్స్: రూ.3.33 కోట్లు సీజ్

image

ఎన్నికలంటే మాటలా.. మొత్తం డబ్బుతోనే పని.. అందుకే నాయకులు వివిధ మార్గాల్లో డబ్బు తరలిస్తుంటారు. అలా వివరాలు లేక పట్టుబడిన డబ్బును పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.3.33 కోట్లను సీజ్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అయితే వివరాలు చెప్పిన వారికి డబ్బు తిరిగి ఇస్తున్నామని పేర్కొన్నారు.