News February 2, 2025
క్రికెట్ పోటీల్లో గద్వాల రాణించాలి: కలెక్టర్

గద్వాల జిల్లా క్రికెట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రం, దేశ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో షేర్ అలీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 క్రికెట్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలని సూచించారు.
Similar News
News September 17, 2025
MBNR: బిచ్చగాడిని హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

దేవరకద్ర బస్ స్టాండ్ సమీపంలో బిచ్చగాడిని రాళ్లతో కొట్టి హత్య చేసిన కేసులో మహబూబ్‌నగర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు వెంకటేష్‌కు న్యాయమూర్తి వి.శారదా దేవి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ఈ కేసు విచారణలో శ్రమించిన సీఐ రామకృష్ణ, డీఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News September 17, 2025
HYD: ప్రైవేట్ పార్ట్స్‌పై విద్యార్థుల దాడి.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై కేసు

నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న ఓ విద్యార్థి పుట్టినరోజు వేడుకల్లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు ప్రైవేట్ పార్ట్స్‌పై కాళ్లతో తన్ని గాయపరిచారు. ఈ విషయమై స్కూల్ ప్రిన్సిపల్‌కు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
News September 17, 2025
పాడేరు: కార్వాన్ పార్క్‌ల ఏర్పాటుకు 5 స్థలాల గుర్తింపు

ఏజెన్సీలో కార్వాన్ పార్కుల ఏర్పాటుకు ఐదు స్థలాలు గుర్తించామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పాడేరు డివిజన్లో 3, రంపచోడవరంలో రెండు స్థలాలు గుర్తించడం జరిగిందన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఐదు మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో కార్వాన్ టూరిజం ఏర్పాట్లపై కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీటీడీసీ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. సమస్యలుంటే త్వరితగతిన పరిష్కరించాలన్నారు.